శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానము
సుముఖశ్చైకదంతశ్చ కపిలో లంబోదరశ్చ వికటో గణాధిపః గజాననః
హేరంబః స్కందపూర్వజః॥
యః పఠేత్ శృణుయాదపి।
హే చ ప్రవేశే నిర్గమే తథా॥ సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే! భీప్సితార్ధసిధ్యర్థం పూజితో యస్సురైరపి ||
తస్మై గణాధిపతియే నమః॥
ఓం కేశవాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ స్వాహా, మూడుసార్లు తీర్ధము పుచ్చుకొనవలెను )
అద్య బ్రహ్మణః ద్వితీయపరార్దే | శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే
భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశ్ (శ్రీశైలమునకు
తాము ఉన్నదిక్కును చెప్పుకొనవలెను) కృష్ణాగోదావర్యోః మహా శక కృష్ణా కావేరీనదుల మధ్యనున్నవారు
“కృష్ణాకావేర్యోర్మద్యదేశే" అని స్వగృహే (అద్దెయింటియందున్న వారు “వాసగృహే" అని చెప్పవలెను.)
. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తా భాద్రపదమాసే శుక్ల పక్షే వాసరే,
శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం చతుర్ధ్యాం శుభతిధౌ మమ ఉపాత్త
దురితక్షయద్వారా అస్మాకం సహకుటుంబానాం క్షేమసైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్ధం, సకలవిద్యా ప్రాప్త్యర్ధం, మనోవాంఛాఫల సిద్ధ్యర్ధం సమస్త
దురితోప శాస్త్యర్ధం, సమస్త మంగళావాప్త్యర్ధం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం వర్షేవరేప్రయుక్త వరసిద్ధివినాయక
దేవతాముద్దిశ్య వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ॥
(కుడిచేతి ఉంగరపువేలిని నీటిలో ముంచవలెను ) తదంగకలశపూజాం కరిష్యే || (కుడిచేతి ఉంగరపువేలిని నీటిలో ముంచవలెను.)
(కలశమును గంధము, పుష్పములు, అక్షతలతో పూజించి, కలశముపై
కుడిచేతిని ఉంచి, యీ క్రిందివిధముగా చెప్పవలెను.)
" కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్థితాః
ชี కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా। ఋగ్వేదో2 థ యజుర్వేదస్సామవేదోహ్యధర్వణః||
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబునమాశ్రితాః।
ఆయాంతుసర్వే పూజార్ధం దురితక్షయకారకాః॥ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి! నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
(కలశమునందలి నీటిని తలపైన చల్లుకొని, పూజా ద్రవ్యములపై చల్లవలెను.)
గణపతి పూజా ప్రారంభః
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం అదౌ గణపతిపూజాం కరిష్యే | (పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై నుంచవలెను.)
మహాగణాధిపతియే నమః
ధ్యాయామి, ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను.) అవాహయామి, ఆవాహనం సమర్పయామి
(క్రిందిభాగమున నీటిని చల్లవలెను.)
ఆసనం సమర్పయామి
(పుష్పమునుంచవలెను)
హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి
(నీటిని చల్లవలెను)
(నీటిని చల్లవలెను)
పాదయోః పాద్యం సమర్పయామి
ఔపచారికస్నానం సమర్పయామి
(నీటిని చల్లవలెను)
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
వస్త్రం సమర్పయామి
(దూదితో చేసిన వస్త్రము లేదా పుష్పము నుంచవలెను)
గంధాన్ ధారయామి
(గంధమును చల్లవలెను)
గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
పుష్పైః పూజాయామి (ఈ క్రిందిమంత్రములు చదువుతూ పుష్పము
లుంచవలెను)
ఓం సుముఖాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం గజకర్ణాయ నమః
ఓం వికటాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
స్కందపూర్వజాయ నమః నానావిధ పరిమళపత్రపుష్పాణి
ఓం మహాగణాధిపతయేనమః
సమర్పయామి, (పుష్పములతో పత్రితో అర్చించవలెను)
ధూపం ధూపయామి దీపం దర్శయామి
(అగరుబత్తి వెలిగించవలెను) (దీపమును చూపవలెను)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి। ధియో యో నః ప్రచోదయాత్ ॥
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి, ఓం ప్రాణాయ స్వాహా,
ఓం అపానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా, ఓం సమానాయస్వాహా, ఓం న్యానాయస్వాహా,
ఓం బ్రహ్మణే స్వాహా, మహాగణాధిపతయేనమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లపుముక్కను నివేదించవలెను)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) తాంబూలం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి
(తాంబూలముంచవలెను) (నీటిని చల్లవలెను) ఆనందకర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరము వెలిగించవలెను)
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ| అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
మమ ఇష్టకామ్యార్ధఫల సిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృష్ణమి (గణపతివద్దనుండి అక్షతలుతీసి తలపై ఉంచుకొనవలెను)
వరసిద్ధి వినాయక పూజా ప్రారంభః
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం! పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం॥
ชี ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం। భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం||
శ్లో॥ ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం| చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం॥
శ్రీవరసిద్ధివినాయకం ధ్యాయామి (నమస్కరించవలెను)
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వరః అనాధనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ॥ శ్రీ వరసిద్ధివినాయకం ఆవాహయామి
(విగ్రహమునకు క్రిందిభాగమున తమలపాకుతో నీటిని చల్లవలెను) శ్లో॥ మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం।
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం॥ శ్రీ వరసిద్ధివినాయకాయ ఆసనం సమర్పయామి (పుష్పము నుంచవలెను)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన। గృహాణార్ఘ్యం మయా దత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్॥
శ్రీ వరసిద్ధివినాయకాయ ఆర్ఘ్యం సమర్పయామి (విగ్రహముయొక్క చేతులపై నీటిని చల్లవలెను)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన॥ శ్రీవరసిద్ధివినాయకాయ పాద్యం సమర్పయామి
(పాదములవద్ద నీటిని చల్లవలెను) శ్లో॥ అనాధనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ॥
శ్రీవరసిద్ధివినాయకాయ ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్। మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమో2 స్తుతే॥ శ్రీ వరసిద్ధివినాయకాయ మధుపర్కం సమర్పయామి
(ఆవుపాలు, పెరుగు, నెయ్యిలతోకూడిన మధుపర్కమునుంచవలెను)
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయకః అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత॥ శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి
(పంచామృతములనగా 1. ఆవుపాలు, 2. ఆవుపెరుగు, 3. ఆవునెయ్యి, 4. తేనె
లేక చెరుకురసము లేదా పంచదార, 5. ఫలోదకము లేక పండ్ల రసము వీటన్నిటితో వేరువేరుగా కాని ఒకేసారిగా కాని స్నానము చేయించ వలెను.)
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్। శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ॥ శ్రీ వరసిద్ధివినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి
(ఎర్రని పుష్పము లేదా ఎర్రని అంచుగల రెండు వస్త్రములను
సమర్పించవలెను)
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం। గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక॥ శ్రీవరసిద్ధివినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి
(వెండితీగతో చేసిన యజ్ఞోపతవీతము, బంగారుతీగతో చేసిన
ఉత్తరీయము సమర్పించవలెను. లేదా రెండు పుష్పములుంచవలెను.) รู๊ก చందనాగరుకర్పూరకస్తూరీకుంకుమాన్వితమ్।
విలేపనం సురశ్రేష్ఠ త్వదర్ధం ప్రతిగృహ్యతామ్॥ శ్రీ వరసిద్ధివినాయకాయ గంధాన్ ధారయామి (చన్దనము పూయవలెను)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్। గృహాణ పరమానన్ద శంభుపుత్ర నమోస్తుతే॥ శ్రీవరసిద్ధివినాయకాయ
అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను.)
็ก సుగనీని చ పుష్పాణి వాతకున్దముఖాని చ ఏకవింశతి పత్రాణి గృహాణ గణనాయక॥
అధాంగపూజా
(మంత్రమును చదువుతూ దాని కెదురుగా తెల్పినచోట పూజింపవలెను.)
ఓం గణేశాయ నమః
ఓం ఏకదంతాయ నమః
పాదౌ పూజయామి (పాదములు)
గుల్ఫౌ పూజయామి (మడిమలు)
ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయ నమః
జంఘే పూజయామి
(పిక్కలు)
(తొడలు)
ఊరూ పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః
ఓం హేరంబాయ నమః
కటిం పూజయామి
(పిఱుదు)
ఓం లంబోదరాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం గణేశాయ నమః
ఓం స్థూలకంఠాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం పాశహస్తాయ నమః ఓం గజవక్రాయ నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఉదరం పూజయామి
(బొజ్జ)
నాభిం పూజయామి
(బొడ్డు)
హృదయం పూజయామి (రొమ్ము)
కంఠం పూజయామి
(కంఠం)
స్కంధౌ పూజయామి
(భుజములు)
హస్తా పూజయామి
(చేతులు)
వక్త్రం పూజయామి (ముఖము)
నేత్రే పూజయామి (కన్నులు)
కఠే పూజయామి
(చెవులు)
లలాటం పూజయామి
(నుదురు)
శిరః పూజయామి
(తల)
సర్వాణ్యంగాని పూజయామి
(శరీరమంతట
అథ ఏకవింశతి పత్రపూజా
(21 ఆకులతో పూజ చేయవలెను. పూజించవలసిన ఆకులు బ్రాకెట్లలో
తెలియజేయబడినవి.)
ఓం సుముఖాయ నమః మాచీపత్రం
పూజయామి
(మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం
పూజయామి
(వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం
పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం
పూజయామి
(X83)
ఓం హరసూనవే నమః దుత్తూరపత్రం
పూజయామి
(ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి
(రేగు ఆకు)
ఓం గుహాగ్రజయా నమః అపామార్గపత్రం
సమర్పయామి
(ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి
(తులసీదళములు)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం
సమర్పయామి
(మామిడి ఆకు)
ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి
(గన్నేరు)
ఓం భిన్నదనాయ నమః విష్ణుక్రాంతపత్రం
సమర్పయామి (విష్ణుక్రాంత)
ఓం వటవే నమః దాడిమీపత్రం
సమర్పయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం
సమర్పయామి
(దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం
సమర్పయామి (మరువము)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం
సమర్పయామి (వావిలి ఆకు)
సమర్పయామి
(జాజిఆకు)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం
సమర్పయామి (గండకి ఆకు)
ఓం ఇభవక్రాయ నమః అశ్వత్థపత్రం
సమర్పయామి
(జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం
సమర్పయామి
(రావిఆకు)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి
(మద్దిఆకు)
ఓం కపిలాయ నమః అర్కపత్రం
సమర్పయామి (జిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాణి సమర్పయామి
(పూజచేయగా మిగిలిన ఆకులన్నియు వేయవలెను)
అథాష్టోత్తర శతనామపూజా
(ప్రతి మంత్రమునకు ఒక్కొక్క పూవు లేదా అక్షతలు వేయవలెను.)
ఓం గజాననాయ నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయనమః నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం సుముఖాయనమః నమః
ఓం మహాబలాయ నమః
ఓం కృతినే నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మంగళ
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం సర్వోపన్యాసాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమారగురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
స్వరూపాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్తే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం ప్రాకృతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం భవాయ నమః
ఓం బలోతైతాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్లే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వకర్తే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం కపిత్థపనసప్రియాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజితాయ నమః
ఓం జితమన్మధాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జయినే నమః
ఓం యక్షకిన్నర సేవితాయ నమః
గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయినే నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః |
ఓం జ్యోతిషే నమః
ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధరాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం అగ్రగామినే నమః
ఓం సహిష్టవే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం సతతోత్థతాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః
ఓం విశ్వదృశే నమః
ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం సఖ్యై నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం అక్రాన్తచిదచిత్ప్రభవే నమః
ఓం మణి కింకిణీమేఖలాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయనమః అష్టోత్తర శతనామాపూజాం సమర్పయామి.
దశాఙ్గం గుగ్గులోపేతం సుగన్ధి సుమనోహరం।
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ॥
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః ధూపమాఘ్రాపయామి
(దశాబ్దము, గుగ్గులము నిప్పులపై వేసి పొగచూపవలెను లేదా అగరువత్తి వెలిగించవలెను)
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే॥ శ్రీ వరసిద్ధివినాయకాయ దీపం దర్శయామి
(దీపమును చూపవలెను)
సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్। నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్దై: ప్రకల్పితాన్॥
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ॥
ఇదం గృహాణనైవేద్యం మయా దత్తం వినాయక || శ్రీ వరసిద్ధివినాయకాయ మహానైవేద్యం సమర్పయామి॥
(పిండివంటలు మొదలైనవానితో కూడిన మహానివేదన చేయవలెను)
శ్లో ॥ పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం। కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం||
శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః తాంబూలం
సమర్పయామి
(వక్క, పచ్చకర్పూరము ఉంచి తాంబూలమును సమర్పించవలెను)
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ | భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక॥ శ్రీ వరసిద్ధివినాయకాయ
సువర్ణమంత్రపుష్పం సమర్పయామి
(పుష్పము సమర్పించవలెను)
శ్లో॥ ఘృతవర్తిసహసైశ్చ కర్పూరశకలైస్తధా! నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ॥ శ్రీ వరసిద్ధివినాయకాయ
నీరాజనం దర్శయామి (ఆవునేతితో తడిపిన వత్తులను కర్పూరమును వెలిగించవలెను)
నీరాజనానన్తరం ఆచమనీయం సమర్పయామి (నీటిని సమర్పించవలెను)
అథదూర్వాయుగ్మపూజా
(ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్కజత గరికవేయవలెను)
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః
పూజయామి
ఓం అఖువాహనాయ నమః
పూజయామి
ఓం వినాయకాయ నమః
పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః
పూజయామి
ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
పూజయామి
ఓం ఏకదన్తాయ నమః
పూజయామి
ఓం ఇభవక్రాయ నమః
పూజయామి
ఓం మూషికవాహనాయ నమః
పూజయామి
ఓం కుమారగురవే నమః
పూజయామి
(దోసిలియందు పుష్పమునుంచుకొని క్రింది మంత్రమును చెప్పవలెను)
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన।
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ॥
ఏకదనైకవదన తథా మూషిక వాహన।
కుమారగురవే తుభ్యం అర్పయామి సమాజ్జలిమ్ ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి
(పుష్పములను ఉంచవలెను)
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశనః॥
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆత్మప్రదక్షిణ సమర్పయామి (ఆత్మప్రదక్షిణ చేయవలెను)
ชีพ అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక। గన్ధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన॥ శ్రీ వరసిద్ధి వినాయకాయ పునరర్ఘ్యం సమర్పయామి
(పై శ్లోకమును చెప్పుచూ 3 మారులు నీటిని విడువవలెను)
వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ॥ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్వేషు సర్వదా॥ (గణపతికి నమస్కరించవలెను)
(వాయనదానము)
గణేశః ప్రతిగృహ్లాతు గణేశో వై దదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమో నమః॥ (ఈ శ్లోకము వాయనమిచ్చువాడు చెప్పవలెను)
మంత్రము - దేవస్య త్వా సవితుః ప్రసవే 2 శ్వినోర్బాహుభ్యాం పూష్ణో . హస్తాభ్యామాదదే। (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువాడు చెప్పవలెను)
(పూజచేసినవారు ఈ క్రింది శ్లోకములను చెప్పుచూ
ఆత్మప్రదక్షణ నమస్కారములను చేయవలెను.)
యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ। తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షణ పదేపదే॥ పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవః|
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలః అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ॥ తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక॥
కథ ప్రారంభం
పూర్వం చంద్రవంశంలో “ధర్మరాజు” అను పేరుగల రాజుండేవాడు. ఆయన గ్రహచారం చాలక రాజ్యాన్ని దాయాదులు అపహరించారు.
అప్పుడు భార్యతోనూ తమ్ముళ్ళతోనూ కలిసి ఆ రాజు వనవాసానికి బయలుదేరాడు. పెద్ద పెద్ద క్రూరమృగాలతో కూడి ప్రవేశించటానికి కూడా
వీలుకాని దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు ధర్మరాజు.
ఆ అడవిలో సూర్యుడిలాగానూ, అగ్నిలాగాను ప్రకాశించే మహాతేజస్వులూ, ఆకులు, పండ్లుమాత్రమే ఆహారంగా కలిగినవాళ్ళూ,
ఎల్లప్పుడూ అగ్నిహోత్రం చేసే వాళ్ళూ, అతిధులను పూజించే స్వభావంకలవారూ అయిన మునులు చేతులు పైకెత్తి ఆధారం
లేకుండానే తపస్సు చేస్తూ కన్పించారు. ధర్మరాజు వాళ్ళను చూచి సంతోషపడుతూ,
సూతమహాముని ఆశ్రమానికి వెళ్ళి, తన భార్యతోనూ తమ్ముళ్ళతోనూ ఆ మునీంద్రుడికి నమస్కరించి “సకలశాస్త్రములు చదివి,
గొప్ప పండితుడవైన ఓ సూతమహర్షి మా దాయాదులైన కౌరవులు మాతో మోసపుజూదం ఆడి మా రాజ్యాన్ని లాక్కొని, మమ్ము,
ద్రౌపదిని బాధపెట్టి, మా పిల్లలను దొంగిలించి మాకు ' చాలా దుఃఖాన్ని కలిగించారు. మీ దర్శనంవల్ల మా దుఃఖం నశించింది.
మీరు సకల శాస్త్రాలూ తెలిసినవారు కనుక దయతో మమ్మనుగ్రహించి, ఎలాగైనా మరల మా రాజ్యం మాకు వచ్చేలా ఏదైనా వ్రతాన్ని
బోధించండి" అని వేడుకున్నాడు.
అప్పుడు సూతమహర్షి “ఓ పాండవులారా! వ్రతాలలో ఉత్తమమైనది, మానవులకు సకల సంపదలనూ, సౌఖ్యాన్ని వృద్ధి పొందించేది,
సకల పాపాలనూ పోగొట్టేది అయిన ఒక రహస్యమైన వ్రతాన్ని పూర్వం పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించాడు. కుమారస్వామి
అడిగినరీతి, పరమేశ్వరుడు తన కుమారునికి బదులు చెప్పినరీతి వివరిస్తాను వినండి” అని యీ విధంగా చెప్పటం ప్రారంభించాడు.
రకరకాలమణులతో అందమైన కైలాస పర్వతంమీద కల్పవృక్షం క్రింద బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు శంకరుడు.
అప్పుడు కుమారస్వామి ప్రజలకు మేలు చేయాలన్న కోరికతో తండ్రిని చూచి "ఓ భగవంతుడా! మానవుడు సకలసంపదలు కలిగి
పుత్రపౌత్రులతో సుఖంగా ఉండాలంటే ఏ వ్రతాలను చేయాలి? అట్టి వ్రతాలలో ఉత్తమమైన ఒక వ్రతాన్ని అనుగ్రహించు"
అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు తన కుమారుణ్ణి చూచి
కుమారా! సకలసంపదలను, దీర్ఘాయుస్సును, పొందటానికి, కోరికనకోర్కెలు నెరవేరటానికి “గణపతిపూజ" అనే వ్రతమొకటి ఉంది.
ఆ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి, స్నానం చేసి, తన శక్తికి తగినట్లు ద్రవ్యలోపం లేకుండా,
వెండితోగాని, బంగారుతోగాని, చివరకు మట్టితో అయినా సరే వినాయకుని ప్రతిమను తయారుచేసికొని, తన యింటిలో ఉత్తరపుదిక్కున
పాలవెల్లిని ఏర్పాటుచేసి, దానిమధ్య ఎనిమిదిరేకులుగల పద్మాన్ని బియ్యపుపిండితోగాని, యవలతోగాని వేసి, వినాయకుని, ప్రతిమను
పెట్టి, భక్తిపూర్వకంగా, గంధముతోనూ, అక్షతలతోనూ, పువ్వులతోను, గరిక పోచలతోను, ఇరవై ఒక్క పత్రములతోనూ, పూజచేసి, ధూప,
దీపాలను సమర్పించి నేతితో వండిన కుడుములు, టెంకాయలు, అరటిపళ్ళు, వెలగపళ్ళు, చెరకుగడలు మరియు అనేక విధాలయిన
భక్ష్యాలు ఒక్కొక్కటి ఇరవై ఒక్కటి వంతున వినాయకునికి నైవేద్యం పెట్టి వినాయకుని సన్నిధిలో నాట్యం చేసి, పాటలుపాడి, పురాణపరనం
విని వినాయకుని తృప్తిపొందించాలి. తరువాత వేధాధ్యన పరుడైన బ్రాహ్మణునకు వాయనం యివ్వాలి. అటుతరువాత బంధువులతోను
పుత్రులతోను కలసి నూనె తగులక భోజనము చేయవలెను ఈ విధంగా భక్తితో వినాయక వ్రతాన్ని ఆచరించినవారికి సకల కోరికలూ
సిద్ధిస్తాయనటంలో సందేహంలేదు. ఆ మరునాడు కూడా ఉదయాన్నే లేచి స్నానంచేసి, గణపతికి
పునః పూజ చేయాలి. ఆ రోజు ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతికొరకు ముంజదర్భ త్రాటిని, జింకచర్మాన్ని, దండాన్ని, యజ్ఞోపవీతాన్ని,
కమండలాన్ని, వస్త్రాన్ని తన శక్తికి తగినట్లు ఇవ్వాలి. పిమ్మట పురోహితుడికి శక్తిలోపం లేకుండా బహుమతులివ్వాలి.
ఇది వ్రతాలలో కెల్లా ఉత్తమమైన వ్రతం ఈ వ్రతాన్ని క్రిందటి కల్పంలో దేవతలూ, గంధర్వులు, కిన్నరులు మరియు అనేక
మంది ఆచరించారు అన్నాడు.
ఓ ధర్మరాజా, ఈ ప్రకారం పరమశివుడు కుమారస్వామికి ఉపదేశించాడు, కాబట్టి నువ్వు కూడా ఇదేప్రకారంగా గణపతిని పూజిస్తే
తప్పక నీకు జయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించారు. ఈ వ్రతాన్ని చేసి, దమయంతి నలుని,
కృష్ణుడు జాంబవతిని, స్యమంతకమణిని పొందారు. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. రావణుడు సీతను
అపహరించినప్పుడు రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. భగీరథుడు గంగను తేవడానికి, దేవాసురులు
అమృతాన్ని పుట్టించడానికి ఈ గణనాథ వ్రతాన్ని ఆచరించారు.
మనస్సులో తలచిన కార్యాలను నెరవేరుస్తాడు కనుక గణపతిని సిద్ధివినాయకుడు అంటారు. ఈ గణపతిని
విద్యప్రారంభించేటప్పుడు పూజిస్తే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే జయాన్ని, బిడ్డలను కోరేవారు
పూజిస్తే బిడ్డలను పొందుతారు. భర్తను కోరి పూజించేవారికి చక్కని భర్త లభిస్తాడు. విధవలు పూజిస్తే తరువాత జన్మలో
వైధవ్యం రాదు.
బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాలవారు. స్త్రీలు పిల్లలూ అందరూ ఈ వ్రతాన్ని యథావిధిగా చేసికొని
తమ తమ కోరికలను నెరవేర్చుకొనగలరు. అని ధర్మరాజుతో సూతమహర్షి చెప్పాడు.
అప్పుడు ధర్మరాజు విధిప్రకారంగా గణపతిని పూజించి సకలైశ్వర్యా లనూ, రాజ్యాన్నీ పొంది చాలాకాలం సుఖంగా జీవించాడు
ఇది శ్రీ స్కాందపురాణములోని ఉమామహేశ్వర సంవాదమునందలి
వినాయక వ్రతకల్పము
శ్యమంతకోపాఖ్యానం
గజాననుడు జన్మించినది భాద్రపద శుద్ధ చతుర్ధి, గణాధిపతి అయినది కూడా అదేరోజు. అందుకే భాద్రపద శుద్ధ
చతుర్థినాడు లోకాలన్నీ వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించాయి. సకలలోకాలలోనివారూ విఘ్నేశ్వరునికి
అతిథిసత్కారాలు చేశారు. అందరి అతిధ్యం స్వీకరించి సాయంకాలానికి కైలాసం చేరుకొన్న వినాయకుడు
తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయబోయాడు. కాని మిక్కిలి విందులారగించిన గణపతి లంబోదరుడయ్యాడు.
కనీసం నడుము కూడా వంచలేకపోయాడు. నమస్కరించడానికి ఇబ్బంది పడుతున్న గణపతిని చూచి
ఫక్కున నవ్వాడు చంద్రుడు. కుమారుని చూచి జాలిపడుతున్న పార్వతి చంద్రుని నవ్వుకు కళ్ళెర్రజేసింది.
కోపావేశంతో చంద్రుణ్ణి చూచి "ఓరీ దుష్టుడా మమ్మాశ్రయించి జీవిస్తున్న నీవు నా కుమారుణ్ణి గేలి చేస్తావా?
నీ ముఖం చూచిన ఏ వ్యక్తి అయినా భరించలేని అపనిందలకు గురి అవుతాడు" అంటూ శపించింది.
ఆ శాపానికి గడగడలాడిన చంద్రుడు పార్వతి పాదాలపై పడి 'తల్లీ జగదేకమాతవు నీవే నీ పుత్రుడను శపిస్తే
ఇక దిక్కెవ్వరు?' అని బహుధా స్తుతిస్తూ క్షమించమని ప్రాధేయపడ్డాడు.
అందుకామె ప్రసన్నమై “నా శాపము వృథా కాదు ఈనాడు మాత్రం నా శాపం నీకు వర్తిస్తుంది. కాని నేడు
గణాధిపతిని పూజించిన వారికి మాత్రం అపనిందలు రావు. పూజించనిచో నీ దర్శనంవల్ల దేవతలు
అయినా నిందలు పొందక తప్పదు" అని చెప్పింది.
ఇది ఇలా ఉండగా ఒకప్పుడు యదువంశరాజు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి శ్యమంతకమనే
పేరుగల మణిని గ్రహించాడు. ప్రతిదినము తనను పూజించినవారికి ఎనిమిది బారువుల బంగారమును
ప్రసాదించగల ఆ మణిని ధరించినవారు సూర్యునివలె ప్రకాశిస్తారు. ఒకనాడామణిని ధరించి శ్రీకృష్ణుని
చూడటానికి వచ్చాడు సత్రాజిత్తు. కృష్ణుడు అతనికి అతిధిసత్కారములు చేసి, విశేషములు తెలుసుకొని,
ఆ మణిని తనకు యివ్వవలసినదిగా కోరాడు. నిరాకరించి వెళ్ళిపోయాడు సత్రాజిత్తు.
ఒకనాడు సత్రాజిత్తు సోదరుడు ఆ మణిని ధరించి, అడవికి వెళ్ళగా ఒక సింహ మతనిని సంహరించి మిక్కిలి
కాంతిగల ఆ మణిని నోట కరచుకు పోయింది. జాంబవంతుడా పులిని చంపి మణిని తన కుమార్తెకు
ఆటవస్తువుగా యిచ్చాడు.
మణి పోయిన సంగతి తెలిసికొని సత్రాజిత్తు కృష్ణుడే మణికొరకు తన సోదరుని చంపినట్లు ప్రచారం చేశాడు.
ఆ అవమానం భరించలేని శ్రీకృష్ణుడు అరణ్యమంతా గాలించి, కాలి గుర్తులను బట్టి జాంబవంతుని
గుహలోనికి ప్రవేశించి 27 రోజులు జాంబవంతునితో యుద్ధంచేసి, చివరకు ఓడించి మణితో పాటు
అతని కుమార్తె జాంబవతిని కూడా స్వీకరించి మణిని సత్రాజిత్తుకు సమర్పించాడు. తాను వినాయక
చతుర్దినాటి సాయంకాలం పాలు పితుకుతూ పాలలో ప్రతిబింబించిన చంద్రుని చూసినందువల్లనే
ఈ నిందను అనుభవించ వలసి వచ్చినదనిచెప్పి, జరిగిన దానిని అందరకూ వివరించాడు.
అది విన్న దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి 'స్వామీ! మీరు సమర్థులు కనుక మీపై వచ్చిన
నీలాపనిందను పోగొట్టుకొనగలిగిరి. మా వంటివారికి తగు ఉపాయమును తెలియజెప్పు' మని కోరారు.
అప్పుడు శ్రీకృష్ణుడు “భాద్రపదశుద్ధ చవితినాడు గణాధిపతిని పూజించి, యీ శ్యమంతకమణి కథను
చెప్పుకొని అక్షింతలు తలపై ధరించినవారు ప్రమాదవశమున చంద్రుని చూచిననూ అపనిందలకు గురికారు'
అని చెప్పాడు. నాటి నుండి ప్రజలంతా
ప్రతిఏటా, భాద్రపద శుద్ధ చవితినాడు శ్రద్ధతోనూ, భక్తితోనూ,
గణపతిని పూజిస్తున్నారు.
No comments:
Post a Comment